అలో..
personality development అని పెట్టా అని నేనేదో దాని గురించి lecture పీకుతా అని అనుకోవద్దు!
మొన్నీ మధ్య ఇదే subject తో ఓ మెయిల్ వచ్చింది.. స్పీకర్ స్వామి vivekananda ఆశ్రమం నించి వస్తారు అని తెలిసి, రెక్కలు కట్టుకుని వెళ్లి సెమినార్ హాల్ లో వాళా!
తీరా అక్కడ చెప్పింది ఏమీ పెద్దగా నాకు రుచించలేదు! సో, body-present mind-absent!! [:D]
ప్రేశ్నోత్తరాల సమయం లో మాత్రం కాస్త స్పృహ లోకి వచ్చా.. ఎందుకంటే ఆయన సమాధానాలు కాస్త quick-witted గా ఉన్నట్టు అనిపించి!
మొత్తానికి చివరి దాక ఉండి కాని బైటకు రాలేదు!
as usual, lab కి వెళ్ళా.. అక్కడ మా "తమ్ములుంగారు" ఉన్నారు.. జరిగిందంతా చెప్పేసా! ఆయన అప్పుడు వెంటనే ఓ చిరు మందహాసం ఇచ్చి, నేను మా చేల్లెలకి personality development classes తీసుకుంటా అని అన్నారు!
ముందు కాస్త అవక్కయినా, అక్కడ(సెమినార్ లో) ఎలాగూ విన లేదు కదా! ఇక్కడ విందాం అని (మా తమ్ములుంగారు మహ బాగా వివరిస్తారు లెండి), "క్లాసేసా, ఏమి తీసుకుంటారు" అని అడిగేసా!
ఆయన, చేతులు తన భుజాల మీద పెట్టుకుని, ఒక్కే ఒక వాక్యం అన్నారు..
"TAKE the responsibility on your shoulders.
And KNOW, you are the creator of your OWN DESTINY".
ఆహా ఎంత క్లుప్తం గా, విషయాన్నీ చెప్పారు అని అనిపించింది! మా తమ్ములుంగారు రియల్లీ rocks!
ఇది ఎక్కడో విన్నట్టు ఉంది అని ఆలోచించకండి, these are the words of Swami Vivekananda.
దీనిని వినంగానే నాకు ఇలా అనిపించింది,
when you know, you are the creator of your own destiny, నువ్వే నిన్ను సృష్టించుకున్న బ్రహ్మ వి ఐనావు,
when you take the responsibility on your shoulders, నువ్వు నిన్ను నడిపించుకునే విష్ణు వి ఐనావు,
this implies, you are also the destroyer, అంటే నువ్వే మహేశ్వరుడు ఐనావు,
అంటే, త్రిమూర్తులు నాలోనే ఉన్నారు!! అలా ఉన్ననాడు నేను సమతాళము(harmony) లో ఉన్నట్టు. well, what more can be ideal personality!
ఆహ్! ఏమి చెప్పారు స్వామీ! అందుకే మీరు ఎందరికో మార్గ దర్శకులు ఐయ్యారు!
ఇదే తరుణం లో నాకేదో సినిమా పాటలో ఓ పంక్తి గుర్తుకొస్తోంది..
"తోచినట్టు గా అందరి రాతలు బ్రహ్మే రాస్తారు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే మార్చాలి",
వీరెంత బాగా రాసారండి! ఇదంతా చూస్తుంటే, ఈ వాక్యం వాడకుండా ఉండలేకపోతున్నా!
"ఎవరు ఇచ్చారమ్మ ఇన్ని అక్షరాలు, అక్షరాల వెనుక ఎన్ని అర్ధాలు"
ముగింపు కోసం,
"ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి వందనాలు".
సెలవు!
Subscribe to:
Post Comments (Atom)
ఇలా త్రిమూత్రుల కోణం నాకు ఎప్పుడూ తట్టనేలేదు.
ReplyDeleteబాగుంది.
:) బాగుంది.
ReplyDeletebhale cheptunnaru kada meeru .. :)
ReplyDelete