Wednesday, April 15, 2009

నవ్వు

అలో..

"ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపెం ఉన్నది!!" ఇది ఒక్కప్పటి శ్రామికుడి work principle. మరి ఈ కాలంలో ఈ సిద్ధాంతం పని చేస్తుందా?

అబ్బే! no way.. we dont have so much time ya! అని వా పోతారు చాలా మంది ఉద్యోగస్తులు. పాపం!! వాళ్ళు మాత్రం ఎం చేస్తారు లెండి.. పోదున్నే లేవాలి, రెడీ లు అవ్వాలి, ఎక్కడెక్కడో ఉన్న ఆఫీసులకి పోవాలి, పనులు చేసుకోవాలి, మళ్లీ సాయంత్రాలు ఇళ్ళకి రావటం, తిని పడుకోవడానికే వాళ్ళకి ఉన్న సమయం సరి పోవటం లేదు. ఈ మధ్యలో ఇలా ఆటలు పాటలు అంటే .. కష్టమే కదా మరి!

ఇందులో మిగిలిన ఉద్యోగస్తుల సంగతి ఎలా ఉన్నా, software ఉద్యోగస్తుల పరిస్ధితి మాత్రం మరీ అన్యాయంగా ఉంటుంది (వాళ్ళేమన్నా గోడకుర్చీ వెయ్యటానికే పుట్టారా?). అస్తమానం కంప్యూటర్లకి కళ్లు, చేతులు అప్పచెప్పి, కుర్చీ లో నించి కదలకుండా బ్రతుకు సాగించుకుంటారు. (కొంత మంది సాఫ్టువేరు వారు, ఇందుకు గర్వంగా ఫీల్ అవ్వచ్చు, వెల్, నో హార్డ్ ఫీలింగ్స్!) .

ఇలా ఎప్పుడు పని పని పని చేసి, వీళ్ళకి పాపం frustrations, కోపాలు, చిరాకులు, ఇలా దారిన పోయే ప్రతీ దరిద్రాన్ని నెత్తిన రుద్దుకుంటారు! మరి ఏమిటబ్బా వీరి సమస్యకి పరిష్కారం?

ఆ పరిష్కారమే "హాస్యం /నవ్వు/laughter". నిజామా అని టక్ మని doubt రావాలి కదా! నాకు "అవును" అని గట్టిగా అనిపిస్తోంది! (అంటే 'ఆట' లో వచ్చే ఆరోగ్యాన్ని ఇవ్వకపోవచ్చు కాని, ఈ చిరాకుల్లో వచ్చే, పైత్య ప్రేలాపాలు మాత్రం కచ్చితంగా తగ్గుతాయి!)

"నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం" అని జంధ్యాల గారు, ఎప్పుడో అన్నారు.

ఎంత పని వొత్తిడి లో ఉన్నా, ఒక అరగంట ఆలా ఫ్రెండ్స్ తో కూర్చొని నవ్వుకోండి.. తేడా మీకే తెలుస్తుంది!! btb, ఈ మధ్య "laughing therapy" లు కూడా ఫేమస్ ఐ పోతున్నై కదా!

"laughing" is a true stress reliever!

మీరవునన్నా కాదన్నా నేను మాత్రం దీనిని నమ్ముతా!

ఇంతా ఉపోద్గాతం ఇచ్చింది, మన తెలుగు సినిమా లో కామెడీ గురించి చెబుదామని! ఏదేదో చెబుతూ అసలు విషయాన్నే మర్చి పోయా! its ok!

సశేషం!

సెలవు!

2 comments:

  1. అసలు విషయాన్ని మరిచిపోయావ్ గా..దాని గురించి చెప్పు.
    rofl @ గోడకుర్చీ వేయడానికి పుట్టడం.

    ReplyDelete
  2. A hearty laughter is really a stress reliever and I have personally felt it in my life. And now people are going in search of laughther therapy instead of finding it inside themselves.

    ReplyDelete