అలో..
అప్పుడే రెండో పోస్టు కు శ్రీకారం చుట్టా!
నాలో ఉన్న "love element" టక్ మని (dracula సినిమాలో వాడి చేయిలా) మేలుకుని "దేవదాస్" పాటలు వైపు అలా పరుగు తీసాయి!
ఐ నా ఏ మంచి ప్రేమ గీతాలో వినాలి కాని దేవదాసు ఏమిటా అని నాకే అనుమానం వచ్చింది! ఆలోచిస్తే అర్ధం అయ్యింది కదా.. ఈ ప్రేమ గీతాలలో ప్రియురాలు ప్రియుణ్ణి తలుచుకుని మురిసి పోవటమో, లేదా ప్రియుడు ప్రియురాలిని వర్ణించి "వాగ్దానాలు" చెయ్యటమో తప్ప, ఏమి పెద్ద interesting గా రాయరు మన రైటర్స్ అని!!
అదే ఓ విఫలించిన జీవితాన్ని(I meant love failures!) గురించి రాయమనూ, జీవిత సారాంశాన్ని crystal-clear గా చూపిస్తారు!
Failures are stepping stones to success అని ఎవరన్నారో ఎందుకన్నారో కాని, ఈ love failures మీద రాసిన ప్రతీ పాట ఓ సూపర్ success అనే అనుకోవాలి!!
btb, నా పోస్టు టైటిల్ "devadas" కదా.. దాని వెనుక నా thought-process ఇది!
"Devadas"--- Sarat Chandra Chattopadhyay-- ఎప్పుడో 1917 లో పబ్లిష్ చేసిన పుస్తకం, ఈ విషయం నాకు ఈ మధ్యే తెలిసింది లెండి! కాని "దేవదాస్" అనంగానే ముందు గుర్తుకొచ్చేది మాత్రం సినిమా నే!!! ఎన్ని సార్లు తీసారో కదా..
నాకు మరీ గుర్తుకొచ్చేవి, మన తెలుగు ANR దేవదాసు, ఆహ! ఏమి పాటలు అండి !! (సినిమా లో ప్రతీ ఒక్కరి అభినయం కూడా వర్ణనాతీతం లెండి!)
అందులో ఓ ఆణిముత్యం లాంటిది ఈ పాట ...
"జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా ||జగమె||
కలిమి లేములు కష్ట సుఖాలు
కలిమి లేములు కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి ||జగమె||
ఆశా మోహముల దరిరానికోయి
ఆశా మోహముల దరిరానికోయి
అన్యులకే నీ సుఖము అంకితమ్మోయి
అన్యులకే నీ సుఖము అంకితమ్మోయి
బాధే సౌక్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
బాధే సౌక్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్ ||జగమె|| "
ఇదే తరుణంలో ఈ పాట రాసిన వారిని ఒక్క సారి స్మరించు కోవాలి కదా!
వ్రాసిన వారు-- sri సముద్రాల. పాటని కంపోస్ చేసే సమయానికి పాపం మ్యూజిక్ డైరెక్టర్ CR Subbaraman కన్ను మూసారట!!! ఆయన శిష్యులు Viswanathan-Ramamurthy దీనిని కంపోస్ చేసారట! (రెఫ్)
ఎంత బాగా రాసారో కదా!
భగవంతుడు సృష్టించిన కుండలు ఈ మానవ జీవితాలు, ఐ నా వీటికి బాధ, సౌఖ్యం, ప్రేమ, ఆశ, మొహం ఇలా ఎన్నెన్నో బంధనాలు, ఇదంతా "మాయ" కాక ఇంకేమిటి!
అందుకే "జగమే మాయ బ్రతుకే మాయ" is very well-said!
సశేషం!
ఇప్పటికి.. సెలవు!
Subscribe to:
Post Comments (Atom)
why didn't u add your interpretations? :)
ReplyDeletekeep writing. I am sure this will be a very entertaining blog.
@S:
ReplyDeleteయుహుహ! అందుకే సశేషం అనింది! ఐ తే FOLLOW ME!! [:D]
chala chala bagudni, I love this post ..:)
ReplyDelete