Tuesday, October 2, 2012

6pack..tetrapack :P

అలో,

"నీలో మనిషి కన్నా కోతి లక్షణాలు ఎక్కువ" అని ఒక మహా మనిషి నన్ను అభివర్ణించిన సందర్భం సాక్షి గా.. నాలో ఉన్న కోతి గతులు తప్పి గెంతులేస్తూ రాస్తున్న  టపా ఇది.

వెల్, విషయం ఏమిటమ్మా? ఆ six ప్యాక్ tetra ప్యాక్ తో నీకొచ్చిన బాధ ఏంటి అని మీరు నన్ను అడగచ్చు.. మీరు అడిగినా అడగక పోయినా నేను చెప్పేస్తాను.. రెండూ నా దృష్టి లో "unhealthy " యే.

ఓకే! preservatives ఉంటాయి కనుక tetra ప్యాక్ unhealthy అని అందరకి, కనీసం కొందరికి తెలిసిందే! కాని దానిని ఈ 6 ప్యాక్ తో దేనికి పోల్చావ్? అసలయినా 6ప్యాక్ సినిమా హీరోలను వర్ణించటానికి వాడతారు కదా, దానిని ఈ ఆరోగ్యానికి సంబందించిన విషయంతో పోల్చాలని నీకెందుకు అనిపిస్తుంది అని మీరు నన్ను అడగచ్చు.. :) :)

ఏమంటూ మన హీరోలు 6ప్యాక్ concept స్టార్ట్ చేసారో..(నాకు అంతకు ముందు brucelee, jackie chan లాంటి వాళ్ళు  ఉన్నారని తెలుసు కాని, ఈ మధ్య కాలం లోనే మన తెలుగు హీరోలు (నాకు కనిపించేలా) మొదలెట్టారు! ), సినిమాలలో ఏం చూస్తామో, వాళ్ళు(అంటే మన దర్శకులు, హీరోలు) ఏం చూపిద్దాం అనుకుంటున్నారో నాకైతే బొత్తిగా అర్ధం కావటం లేదు. perhaps, నేను still yesteryear ఆలోచనలోనే ఇంకా ఉండిపోయనేమో !

ఒకప్పుడు ముష్టి యుద్ధాలలో  (అంటే, మన హీరో-విలన్ fights) వాళ్ళు ఎలా కొట్టుకున్నా dishum-dishum అన్న sounds మాత్రమే వినిపించేవి. కాలం మారింది రక్తం కనిపించేలా కొట్టుకోవటం మొదలుపెట్టారు.. ఒకళ్ళు కాకుండా పదిమందిని వెంటేసుకుని కొట్టుకోవటం, వయసుతో సంబంధం లేకుండా హీరో-ism చూపించటం ఇలా రకరకాలుగా కొట్టుకుంటూ నే ఉన్నారు. వెల్, విబేధం సహజం, యుద్ధం అనివార్యం అని మహాభారతంనించి మనకి తెలిసిన విషయమే కదా అని అనుకునే దానిని. మరి, ఇన్ని తెలిసి మరీ ఎందుకు 6ప్యాక్ concepts ని హర్షించలేకపోతున్నావు  అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను.  దానికి సమాధానం లేకపోలేదు!

మొన్నీమద్యే ఒక కొత్త తెలుగు సినిమా చూసా! వారానికి నాలుగు వస్తాయి అయితే ఏంటి? అది నాకున్న అతి తక్కువ మంది favorite హీరోల్లో ఒకరిది! హీరో-ఇసం చూపించుకోవటానికి సరిపడే అంత personality ఉన్నవారు ఈయన. మంచి  పొడవు, రంగు,బాడీ ఉన్న అబ్బాయి. కాస్త పొడవు ఎక్కువే, (మన ఊరులో) ఉన్నవాళ్ళు అందరితో పోలిస్తే! అందుకేనేమో నాకు ఈకాలం హీరోలలో ఈయనంటే కాస్త అభిమానం. ఆ పొడవుకు సరిపడేలా ఉండాలనేమో ఆయనకీ కాస్త మొరటు roles యే ఎప్పుడూ వస్తుంటాయి. ఈ మధ్య కాలం lo కాస్త బాణీ  మార్చి, కాస్త ఫ్రెండ్లీ roles చేస్తున్నారు.. ఏమయిందో ఏమో మళ్లీ పాత బాణీ  లో ఈ సినిమాలో నటించారు పాపం ఈయన.

 అంటే నమ్మరు కాని, రెండున్నర గెంటల సినిమాలో రెండు గెంటలు మనుషులని కొడుతూనే ఉన్నారు! రకరకాలుగా కొట్టించుకుంటూ, రకరకాలుగా కొడుతూ, అబ్బబ్బా సినిమా అంతా రక్తమయం. ఒక్కదెబ్బకు మనిషి చనిపోతాడా? ఎగిరిపడతారా? ప్రాణం తీయటం స్విచ్ ఆఫ్ చేసినంత సులువా? టపి  టపి మని పేల్చటం! ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింసించవచ్చు అని... అంత పెద్ద తెర పై చూస్తుంటే, ఆహ నా సామిరంగా! ఇంకేదన్నా మిగిలిందా తెరపయిన చూపించటానికి!!!

సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఉంది.. అదేమి  చేస్తుందో తెలీదు.. ఇలాంటి సినిమాలను చూస్తూ ఈలలు గోలలు చేస్తున్న మనుషులు ఏం నేర్చుకుంటున్నారో తెలీదు .. డబ్బులు వస్తే చాలా, ఇటువంటి ఒక మీడియా ద్వారా మనుషులకి ఎం చూపించబోతున్నాము అని మన దర్శకులు ఆలోచించరా? వాళ్ళని చాలా మంది సగటు మనుషులు ఆదర్శప్రాయంగా  తీసుకుంటారు అని తెలిసినా మన హీరోలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అంత బలప్రదర్శన వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న ఆ సదరు 6ప్యాక్ పుణ్యమే అయితే, అటువంటి 6ప్యాక్ హీరో-ఇజం  వల్ల ఎవరి వొరిగేది  ఏమి లేదు. ఇటువంటి సినిమాలవల్ల వచ్చే పిచ్చి ఆలోచనలు అనారోగ్యమే కాని.. హర్షించ తగ్గవి కావు!

వేరే దేశాల్లో వాళ్ళ వాతావరణానికి కొన్ని తినేవి దొరకక వాళ్ళు ఈ tetra ప్యాక్ అనేవి కనిపెట్టుకున్నారు..మనకెందుకు ఇవి? అడుగు దూరం లో అన్ని దొరుకుతాయి, ఒకప్పుడు దొరికేవి కదా?? అవి మాకు వద్దు ఇవే కావాలి అని మనం వీటినే ఆదరిస్తూ అనారోగ్యంపాలు అవుతున్నాం.. ఇలానే ఎవరో చూపించారు, మనం చూపిద్దాం అంటూ, ఏమి చూపించాలో ఎలా చూపించాలో తెలీక ఏదో ఏదో చూపిస్తూ మన సినిమాలను, తద్వారా మనుషుల ఆలోచనలను అనారోగ్యంపాలు చేస్తున్నాయి ప్రస్తుత సినిమాలు!

tetra ప్యాక్ వాటిల్లో ఉన్న పదార్ధాల nutritional values ఎంతవరకు preserve చేస్తున్నాయో తెలీదు కానీ , ఈ 6ప్యాక్స్ మాత్రం మన సినిమాలలో ఉండే entertainment values ని preserve చెయ్యలేకపోతున్నాయి అని నా గట్టి అభిప్రాయం. మీ అభిప్రాయాలు  మీ ఇష్టం అండీ!!

సెలవు.

1 comment:

  1. ఇందాక నేను రాసిన వ్యాఖ్య ఏమైపోయింది?
    ఇంతకీ, సినిమా రెబెల్ ఆ?

    నువ్వు అరిపించేస్తున్నావ్ గా అసలు. కొంచెం ఆ తెలుగేదో సరిగ్గా రాసుకున్నావంటే, దూసుకుపోతావు చూడు ఇంక ;)

    ReplyDelete