అలో,
ఏటి చెప్పాను నానేటి చెప్పాను.. అని నేను అంటే.. చెప్పానే చెప్పొద్దూ అని అనటానికి నా బ్లాగుకి ఆస్కారం లేదు :P అందుకే రాస్తున్న నా మలి టపా.
ఆకాశం మేఘావృతమై ఉంది. పడుతున్న వానలకు ఒక కర్నూలు మునిగి పోయిందని విన్నా, కృష్ణలో కూడా నీటి మట్టం ఎక్కువై కొన్ని ఊరులు మునిగి పోతాయేమో, అందులో మా ఊరు కూడా ఉంటుందేమో అని ఆవేదన చెందుతున్న ఒక స్నేహితుని చూసా, ఏది ఏమైనా ఇవన్ని నన్ను చెలింప చెయ్యటం లేదు. ఉన్నది ఒకటే ఆలోచన. ఎం చెయ్యాలి ఈ రోజు. అసలేదన్న చెయ్యగలనా? అనుకున్నదానిలో ఒక్క శాతం అన్నా చెయ్యగలనా అని ఒకటే ఆరాటం. ఏటి యా, అంతగా ఆలోసింసేది? వాట్ ఈజ్ ఇట్టు? ఈ రోజు మళ్లీ (గళ్ళు మంది గ్లాసు) కల్లాసు. :P ఎవరిదీ? ఇంకయారిది? నాదే! :D
ఎంత చదివినా బావిలో నీళ్లు తోడినట్టు ఇంకా సందేహాలు పుట్టుకొస్తూ నే ఉన్నాయ్. ఇంత అయోమయ గందర గోల పరిస్థితి లో ఏమి చెప్తానో, ఎలా చెప్తానో అని గుండెల్లో "గుబ గుబ". అయినా "సాహసం నా పాదం" అనుకుంటూ సమర రంగం లో కి దూకా(కల్లాసు మొదలు పెట్టా)! అస్త్రాన్ని చేపట్టా( చాకు పీసు ముక్క!) . అనుకున్న వ్యవధిలో తడపడుతూ అయినా తమాయించుకుంటు, నాకు తెలిసినంతలో వారికి(తెలిసి తెలిసి నా కల్లాసులో బలి అవ్వటానికి వచ్చిన వారికి) అర్ధం అయ్యే లా చెబుతూ. బీచ్ బీచ్ మే లెగ్ పుల్లింగ్ చేస్తున్న వారికి దొరకకుండా జంపులు చేస్తు, అయ్యిందనిపించేసా.
నేర్చుకోవటం కష్టం ఐతే నేర్పించటం ఇంకా కష్టం. వాళ్ళకేం వచ్చో, ఎలా చెబితే అర్ధం అవుతుందో, ఏ విషయాన్నీ ఎన్ని రకాలు గ ఆలోచించి ఎటు నించి ప్రశ్నల వర్షం కురిపిస్తారో. అయిబాబోయి! ఇలాంటి ఒక పని చెయ్యాలి అంటే, చాలా నేర్పు ఓర్పు కావాలి. అలాంటిది కొంతమంది 'మాస్టారు'లు మాత్రం ఎలాంటి విషయాన్నీ అన్నా ఎంత చక్కగా అర్ధం అయ్యే లాగా చెబుతారో! వారి సహనానికి, నేర్పుకు, ఓర్పుకు జోహార్!
"దేవుడా, ఓ మంచి దేవుడా" నేనేం అడగాలనుకుంతున్నానో నీకు తెలుసు.. ఎందుకంటే బెసికాల్లీ యు ఆర్ గాడ్, వెరీ గుడ్ గాడ్. అదన్నమాట!
కల్లాసు అయ్యి, కుర్చీ లో కూర్చున్న నేను నా చేతులకేసి చూసుకున్న, అవి పూర్తిగా తడిచి ఉన్నాయి, హ హ, చాకు పీసు పౌడరి తో. :D :D :D
well all is fine, that ends fine, hope my students are also fine! ;) మే గాడ్ బ్లెస్ థెం!
సెలవు.
Saturday, October 3, 2009
Tuesday, September 22, 2009
పరి పరి...
అలో,
చాలా కాలానికి మళ్ళీ నాకు కాలక్షేపం చెయ్యాలనిపించినట్టు ఉంది కాబోలు, అందుకే ఇటు దూకా! యుహుహ.. నా విచిత్రపు నవ్వు సాక్షిగా.
"బుక్కు నిండా ప్రబ్లెంసే" అని అంటే, ఆహా అనుకున్నా, కానీ ఇప్పుడు "బుక్కు నిండా ప్రూఫ్స్ ఏ" :(
(ఓహొహొ! ఖోయా మేరె నీంద్, అంటే ఖోయా ఖోయా చాంద్ అని దేవానంద్ అంటే నేను ఏదోకటి అనాలి కదా :))
"ఎందుకు ఏమిటి ఎలా" ఇది నా బ్లాగు రాయటానికి శ్రీకారం ఐతే, ప్రతీ దానికి "అలా ఎలా వీలుపడుతుంది" అనేది ఈ టపా కి ఆధారం. అర్ధం కాలేదా? ఈ మధ్య నేను నేర్చుకున్న కొత్త పాఠం ఇదే, ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా పరిశీలించింది, పరిశోధించి గాని ఒప్పుకోకూడదు అని మాకు బడి లో చెప్పారు.
(ఆ ఆ, ఎవరో చెబితే మేము ఎలా వింటాం అండీ, మాకు నమ్మకం కలగద్దు... )
మా మాస్టారు ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అందుకేనేమో ఆయనికి మాటకు ముందు పది ప్రశ్నలు మాటకి వెనుక పది ప్రశ్నలు ఉంటాయి. మేము కూడా ఆయన బాటలోనే నడవాలని ఆయన కోరిక..
"ప్రశ్నలు అడగటం సులువే కానీ దానికి సమాధానం చెప్పటమే చాలా కష్టం" ఇది చాలా మంది టీచర్లు చెప్పే మాటే.. ఇలా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కాకుండా నా బుద్ధి వికసించే ప్రశ్నలు అడిగే తెలివితేటలు నాకు రావాలని ఆసిస్తూ..
(అలా పరి పరి సార్లు పరి పరి విధములా ప్రశ్నిస్తే నే విషయంలోని ఆంతర్యం అర్ధం అయ్యేది, understood?)
సెలవు.
(ఇది ఒక రెండు నెలల ముందు రాయాల్సిన టపా, కాస్త ఆలస్యం అయ్యింది. :D. Men may come and men may go, but I go on forever --The Brook లో అనట్టు, కాలం తో మారే రకం కాదు కదా నేను! :P. సో, అన్ని ప్రశ్నలు అడిగే అలవాటు ఇంకా అవ్వలేదు! హొప్ థింగ్స్ చేంజ్ సూన్ ;) )

Monday, July 13, 2009
నాకు నచ్చిన Shamili
అలో,
"Oy" పాటలు బాగున్నాయి అని నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఆఫ్లయిను పెట్టిన గుర్తు. అలా వినటం మొదలు పెట్టాను ఆ సినిమాలో పాటలు. పాటలు బాగున్నాయి. "అంజలి అంజలి అంజలి, మెరిసే నవ్వుల పువ్వుల జాబిలి" ఆ సినిమాలో హీరోయిన్ అని తెలిసి సినిమా చూసేద్దాం అని కూడా చాలా ఉత్సాహపడ్డాను. ఆమె మొహం చూడటానికి google images ని తెగ వేదికేసిన గుర్తు కూడా! అక్కడక్కడ ఏవో కొన్ని ఫోటోలు కనిపించాయి. అమ్మాయి షుమారుగా ఉందనీ, హీరోయిన్ అయ్యే పోలికలు ఎక్కడా లెవ్వని కూడా కొంచెం సందేహం కలిగింది. కాని మన దర్శక నిర్మాతల మీద ఉన్న గట్టి నమ్మకం[:P]. ఏమిటా నమ్మకం అంటే, మీరే ఆలోచించుకోవచ్చు[:D]. చిన్నప్పుడు అంత ముద్దుగా ఉండే షామిలి ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా యాక్ట్ చేస్తుంది హీరోయిన్ గా, ఎలా డాన్స్ చేస్తుంది, ఇలా ఏవేవో అనుమానాలు వచ్చి ఉండవచ్చు, కాని నాకిన్ని అనుమానాలు రాలేదు సుమీ! ఏదో మళ్లీ ఇంత కాలానికి ఆమెని చూడబోతున్నాం కదా వెండి తెర మీదా అని కాస్త ఆత్రత అంతే. హమయ్య! ఉపోత్గాతం అయ్యింది.
రిలీజ్ అయిన ఇన్నాళ్ళకి చూసే తీరిక అవకాశం దొరికేసింది, సినిమా చూసేసా. చూస్తున్నంత సేపు ఒకటే ఆలోచన, "షామిలి" భలే ఉంది కదా అని. నాకెందుకో తను చాలా సహజం గా అనిపించేసింది. ఎక్కడా కాస్త కూడా అసభ్యతకు తావు లేదు. ఆమె అలంకరణలో కాని, ఆమె నటన లో కానీ, ఆమె హావభావాలలో కానీ, ఎక్కడా హీరోయిన్ ఆ ఈమె ఆన్న భావనే రాలేదు. ఇదేదో నేను అడ్డదిడ్దంగా మాట్లాడుతున్న అనుకోకండి, నాకీమె చాలా చాలా నచ్చేసింది..హీరోయిన్ అంటే ఇలానే ఉండాలేమో అన్నంతగా. ఈ కాలంలో హీరోయిన్ లు మొడెర్నిటికీ మరీ ప్రాధాన్యత ఇచ్చేసి, వస్త్రధారణలో హావభావాలలో వారు చూపిస్తున్నదానికి, సగటు మనిషి నిజజీవితానికి అస్సలు పోలికలే కనిపించటం మానేశాయి. హీరోయిన్ అంటే, ఏదో వేరే గ్రహం నించి వచ్చిన ఒక వింతజీవిలా చూస్తాను నేనైతే. ఏమిటో నిజజీవితంలో నాకలాంటి అమ్మాయిలు కనిపించటం చాలా అరుదు అని ఏమో,లేదా వారి అలంకరణకు మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దగా పోలికలు అనిపించక పోవటం వల్లనో తెలీదు కానీ, నాకు ఇప్పుడు ఉన్న మన హీరోయిన్లు గ్రహాన్తరవాసుల్లానే కనిపిస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా బట్టలు వేసుకుని, ఒక సగటు అమ్మాయిలా "షామిలి" కనిపిస్తే నచ్చక ఏమవుతుంది! ఆమె నటనపరంగా మరి కాస్త ఎదగాలేమో అనిపించిన మాట వాస్తవమే కాని, girl-next-door రోల్ కి తను సింప్లీ ఆప్ట్!
అదే విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉండబట్టలేక అంటున్న-- ఏమిటండి ఈ కాలం లో హీరోయిన్ల వేషధారణ, ఒకళ్ళకి తెలుగు మాట్లాడటం రాదు, పోనిలే డబ్బింగ్ ఆర్టిస్ట్లకు జీవనోపాది కల్పిస్తున్నారులే, ఎలాగూ అది వెనక జరిగే కార్యక్రమమే కదా అని సర్దుకుందాం అనుకుంటే, మరి వారి నటనని ఏమనాలి? కొంతమంది అయితే నవ్వుతున్నారో ఏడుస్తున్నారో కూడా అర్ధం కాదు, జరిగే సందర్భానికి వారి నడతకు ఏమిటో బొత్తిగా పోలికలే కనిపించవు, అది దర్శకుల ప్రతిభో లేదా హీరోయిన్ల ప్రతిభో మరి నా చిన్న బుర్రకి తట్టటం లేదు మరి! ఏదో కొంత మంది పుణ్యమా అంటు, హీరోయిన్ అవసరం ఇంకా సినిమాకి ఉంది అని కాలం గడుస్తుంది. ఒకప్పట్లో ఒక సావిత్రి, ఒక కృష్ణకుమారి, ఒక కాంచన, ఇలాంటి వారు నటిస్తుంటే ఎంత సహజంగా ఉండేదండి. ఎంత చక్కగా అలకరించుకునే వారో, పదహారణాల అచ్చ తెలుగు హీరోయిన్లు అంటే వీరే. ఆ తారువాతి వారిలో సౌందర్య కాస్త అలా ఉండటానికి ప్రయత్నించింది, కాని కాలక్రమేపి ఆమె కూడా కంపెటేషన్ వలయం లోపడి కాస్త వస్త్రధారణ విషయంలో కొంచెం మారింది కాని, తెలుగు సినిమాల్లో తెలుగుతనాన్ని ఉంచటానికి చాలానే ప్రయత్నించింది..
ఇక ఆతర్వాత వచ్చిన వాళ్ళల్లో అసలేవరన్న తెలుగు వారు ఉన్నారో లేదో నే అనుమానం, ఇహ పాపం వాళ్ళకి తెలుగు తనం గురించి తెలుసుకుని దానిని పాటిద్దాం అనే అంత కాల వ్యవధి కూడా ఉన్నటు లేదు, అంటే నాలుగైదు సినిమాల్లో కనిపించంగానే మాయమైపోతారు, ఏది ఎలా ఉన్న తెలుగు లో సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి ప్రజలు చూస్తూనే ఉన్నారు. అంటే కాలం తో పరుగు పెట్టటం మనిషికి ఉన్న మంచి అలవాటు కదా! తక్కిన విషయాలు ఆట్టే పట్టించుకోరు.
ఏముందండి, మారే కాలం తో మేము మారుతున్నాం అంటారు.. అంతకు ముందు ఎలా ఉన్నామో ఏమి చేసేవాల్లమో అన్నా తెలుసో లేదో వీళ్ళకి!
ఏది ఎలా ఉన్న, షామిలి బాగుంది. ఆమె కూడా కాలంతో మరీ ఎక్కువ మారకుండా ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటే ఇంకా బాగుంటుంది.
చలో, సెలవు మరి.
ps: నేను మాట్లాడుతుంది తెలుగు సినిమాల గురించి నాకు అనిపించింది మాత్రమే. దీనిని ఎవరూ అన్యధా అర్ధం చేసుకోకూడదని మనవి!

Monday, June 29, 2009
National Statistics Day - June 29
అలో,
ఈ రోజు, అనగా జూన్ 29, "రాష్ట్రీయ గణాంక దినోత్సవం" (National Statistics Day). అంటే ఏమిటి, ఏ సందర్భంగా జరుపుకుంటారు అని మీరు అడిగితే, ఇదే రోజున 1893 లో, Prasanta Chandra Mahalanobis వారు జన్మించారు. మన దేశానికీ చెందిన గొప్ప statisticians లో ఈయన ఆది పురుషుల్లో ఒకరు. ఆయన statistics రంగం లో చేసిన ఎనలేని సేవలను గుర్తించిన మన ప్రభుత్వం, డిసెంబర్ 2006 లో ఈయన పుట్టిన రోజుకి ఒక ప్రత్యేకత కలిగించాలన్న ఉద్దేశ్యం తో, ఈ రోజుని statistics డే కింద జరుపుకోవాలని నిర్ణయించారు. దీని గురించి ఒక వికీ ఎంట్రీ కూడా లేదు ఏమిటో! :(
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ రోజు మా ఇన్స్టిట్యూట్ వారు జరిపిన National Statistics Day వేడుకల్లో నేను పాలుగున్నా. ఈ సందర్భంగా జరిగిన statistics olympiad లో గెలిచిన పిల్లలకి బహుమతులు ఇచ్చారు. కొంత మంది పెద్దవారు మాట్లాడారు. మొత్తం మీద ఒక మంచి అనుభవం.
మన దేశానికీ చెందిన కొందరు statisticians -- Prasanta Chandra Mahalanobis, Calyampudi Radhakrishna Rao, S R S Varadhan.
మనకిచ్చిన జనన-మరణాలు అనే సరిహద్దులలో మధ్యలో ఉన్నఈ చిన్న జీవితం లో, ప్రపంచానికి ఏదో ఇవ్వాలన్న తపన తో, మార్గదర్సకులుగా మారిన ఇలాంటి గొప్ప గొప్ప వారిని తలుచుంటే, ఆ రోజుకి ఇంక కావల్సిందేముంది!
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
సెలవు.
PS: ఈ "statistics" అన్న పదానికి తెలుగు మాట "గణాంకం" అని, వేడుకల్లో పాలుగున్న తెలుగు విశ్వవిద్యాలం అద్యక్షురాలు అన్నారు. అదో కాదో తెలీదు కనుక.. ఒక సారే వాడాను. తెలిసిన వారు చెప్పవలసిందిగా ప్రార్థన.

Friday, June 26, 2009
హాస్యం
అలో,
ఏదో అలోచిస్తూ ఉంటే ఎటో వెళ్ళాయి నా ఆలోచనలు. పలకరించి చాలా కాలం అయ్యింది కదా అని ఇటు వచ్చా! బాగున్నారా? ఒక కాలం లో అయితే ఇలా పలకరించుకునే వాళ్ళు, అవతలివాళ్ళ క్షేమసమాచారాలు కనుకున్నేందుకు ఇలా మొదలు పెడితే బాగుండేది. కాలం changed, పలకరింపులు changed. తెలిసిన మనిషి కనిపిస్తే "hi" అని ఒక చిరునవ్వు నవ్వేసి వెళ్ళిపోతుంటాం, ఈ "hi" అంటే వాళ్ళు బాగున్నారని మనం అనేసుకుని మనం బాగున్నం అని వాళ్ళకి చెప్పెసుకోవటమో ఏమిటో పాపం! నాకైతే అర్ధం అయ్యేది కాదు, కొన్నాళ్ళు ఆలోచించాను కాని ఆ తర్వాత నలుగురితోపాటు నారాయణ అన్నట్లు నేను వాళ్ళ తీరులోనే వెళ్ళిపోతున్నా. ఇంతకూ నేను రాయలనుకున్నది ఇది కాదు కదా!
"హాస్యం" అని టపాకు పేరు పెట్టి, ఈ గోలంతా ఏమిటి! గోలే అయినా, రెండీటి ఆంతర్యం ఒక్కటే! మారుతున్న కాలం, the changing times. ఏమొచ్చింది మారుతున్న కాలం తో హాస్యానికి వచ్చిన బాధలేమిటి? (హాస్యానికి బాధలోస్తే హాస్యం ఆనందంగా ఉన్నట్టా లేన్నట్టా??) హాస్యానికి బాధలోచ్చాయో లేదో తెలియదు కాని, హాస్యం అన్న పేరు తో సినిమాల్లో చూపిస్తున్న విషయాలను చూస్తే బుర్రున్న వాడికి బాధ రాకుండా ఉండదు. అసలు ఈ కాలం లో వస్తున్న "హాస్యాన్ని" హాస్యం అని అనాలా?? ఏమిటో నాకైతే మరి అలా అనాలనిపించటం లేదు. అందరు అంటున్నారు కదా, ఎలాగూ నువ్వు నలుగురి తో పాటు నారాయణా అని ఉండాలని అనుకుంటున్నావ్ కదా, మరి ఈ హాస్యనినే హాస్యం అని అనేయరాదు, అని అంటే, అప్పుడేమో చెప్పలేం!
ఒకరిని ఒకరు వెక్కిరించుకోవటం, అవతలి వారి లో ఉన్న లోటుపాట్లని అవహేళన చెయ్యటం, ఇదా హాస్యం అంటే? ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న సినిమాలు భావితరాలలో ఏమి చూద్దామనుకుంటున్నాయో మరి!
కేవలం హావభావాలతో, కనుసైగలతో నవ్వించి ప్రపంచాన్ని మెప్పించిన చాప్లిన్, మన తెలుగు సినిమాల్లోకి వస్తే రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం; ఇలాంటి వారు చేసిన దానిని చూసిన కళ్ళకి ఇప్పటి హాస్యాన్ని తట్టుకోవటం కొంచెం కష్టమే సుమీ! ఇప్పటి ఈ హాస్యాన్ని వ్యగ్యం అనాలో ఇంకేం అనాలో నాకైతే తెలియటం లేదు, హాస్యన్నికి ఇదింకో న్యూ dimension అనుకుని సర్దుకుపోవాలేమో! ఆ అది నా వల్ల కాదు అంటే, ఇంకా తేలిక మార్గం, సినిమాలు చూడకుండా ఉండటం :D.
(సినిమాల్లో ఉన్న"హాస్యాన్ని" చూడటంవల్ల కలుగుతున్న హింస గురించే మాట్లాడుతున్నాం కాని, సినిమాల్లో చూపించే హింసతో పోల్చుకుంటే ఇది ఎంత! :P)
మళ్లీ కలుద్దాం,

Wednesday, June 3, 2009
మలి జీవితం లోకి నా తొలి అడుగు
అలో,
మహా తత్తరు పడుతూ, ఎలా ఉంటుందో అని తెగ తెగ ఆలొచిస్తూ, ఎదురు చూసిన కాలం వచ్చి వెళ్ళింది.. phew! the sigh of relief.. సాక్షిగా. ఊహించినంత ఉర్రూతలూగించక పోయినా, "ఉంది లే మంచి కాలం ముందు ముందు నా" అన్న ధైర్యనన్నా కలిగించి నందుకు మనసు కాస్త ఊరట చెందింది. ఎమోచ్చిందా ఇంత ఆవేశపడుతుంది ఈ వెర్రి హృదయం అని అడగాలను కుంటున్నారా.. అబ్బే మీకా శ్రమ ఇవ్వనుకదా!!
"ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈ నాడే ఉదయించింది" అని అనే అంత సమయం సందర్భం కాకపోయినా, 'నేను' అనే ఒక మనిషి, 'ఉద్యోగం' అనే ఒక దానిని చేస్తా అని ఎప్పుడూ అనుకోలేదు, అలాంటిది విజయవంతంగా నా ఉద్యోగం లో మొదటి రోజు ముగించేసా అంటే ఈ మాత్రం ఆవేశపడకుండా నా పిచ్చి గుండె ఉండలేకపోతుంది.. అందుకే ఒక టపా రాసేద్దాం అని రాసేస్తున్నా.
ఇహ రోజు ఎలా గడిపావు అని అంటే, పెద్దగా చేసింది ఎమీ లేదు. అలా అని ఎమీ చెయ్యలేదనుకోవటానికి లేదు. వాతావరణాన్ని అంచనా వేసా, ఆ ఇన్స్టిట్యూట్ కి రాబోతున్న పెద్దల్ని గురించి విన్నా( ఈ విషయమే నాకు రానున్న మంచి కాలానికి సంకేతాన్ని చూపించింది), ఇలా ఏదో అలా అలా అతికీ అతకనట్టు రోజుని గడిపేసా.
ఇవన్నిటికన్నా గుర్తుండిపోయే విష్యం ఇంకొకటి, అక్కడ దేవదాసు మాస్టారి నిజ స్వరూపాన్ని చూడటం. ఆయన పేరు దేవదాసు కాదు లెండి, పేరు వాడకూడదు అయినా పేరు వాడాలి గనుక, ఈ పాట్లు. మాతో అతి సౌమ్యంగా మాట్లాడే ఆయన ఈ రోజు గర్జించటం చూసాక అర్ధం అయ్యింది ఆయన అంత ఉన్నత స్థాయిలోకి ఎలా వెళ్ళారో అన్న విష్యం, ఏమిటా అంటే, "పని లో ఉన్నప్పుడు ఆయన ఇంకా దేనిని పట్టించుకోరు" (ఇక్కడ దేనిని అంటే.. మనుషులనే :P).
అద్భుతాలు, అమోఘాలు కాక పోయినా, ఇవే ఈనాటి నా అనుభవాలు. కొన్ని మధుర జ్ఞాపకాలు.

Sunday, April 26, 2009
ఏది కోరేది వాడినేది అడిగేది, సిరివెన్నెల
అలో,
నేను ఈ పాట వింటున్నా,
" ఆది భిక్షువు వాడినేది కోరేది
ఏది కోరేది వాడినేది అడిగేది"
ఇది ఎక్కడో విన్నట్టు ఉంది అనుకునేరు, "సిరివెన్నెల" సినిమాలోది. ఏ మాటకీ ఆ మాటే చెప్పుకోవాలి, మన సీతారామ శాస్త్రి గారిని ఈ పాటని కూర్చినందుకు ఎన్ని సార్లు అభినందించినా తక్కువే!
బాగుంది కదా! తిట్టాలనుకుంటే ఎలా అన్నా తిట్టచు, తల్చుకోవాలనుకుంటే ఎలా అన్నా తల్చుకోవచ్చు! [:D]
ఎందుకో ఈ పాట వింటూ ఉంటే, నాకు ఈయన అడిగిన దానికి "శ్రీనాధ" కవి సార్వభౌములు వారు చెప్పిన ఈ పద్యం గుర్తుకు వచ్చింది,
" సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపమున కిద్ద రాండ్రా
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్ || "
అదేమిటయ్యా, ఆ పాట వింటూ ఉంటే ఈ పద్యం గుర్తుకు రావటం అని అనుకోవచ్చు, ఆ సంబంధం ఏమిటీ అంటే,
ఒకటి, సిరివెన్నెల వారు శివుణ్ణి ఏమి కోరేది ఏమి అడిగేది అని, పరమేశ్వరుడు ప్రపంచం లో చేసిన అన్యాయాలను (ఇంకా మంచి పదం దొరకటం లేదు, అందుకని ఇప్పటికి ఇదే!) ప్రశ్నిస్తూ ఉంటే, అక్కడ శ్రీనాథుల వారు ఒక భిక్ష గానికి ఇద్దరు పత్నులు దేనికి అని చమత్కరించారు.
రెండోది, 'ఏమి కోరేది ఏమి అడిగేది' అని ఒకరు బాధపడుతుంటే, 'పార్వతి చాలు గంగను విడు' అని సమాధానం ఇచ్చినట్టు లేదు!
సాహిత్య సాగరానికి, మనిషి ఆలోచనకి అంతం ఎక్కడ?
సెలవు!
నేను ఈ పాట వింటున్నా,
" ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది...
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది"
ఇది ఎక్కడో విన్నట్టు ఉంది అనుకునేరు, "సిరివెన్నెల" సినిమాలోది. ఏ మాటకీ ఆ మాటే చెప్పుకోవాలి, మన సీతారామ శాస్త్రి గారిని ఈ పాటని కూర్చినందుకు ఎన్ని సార్లు అభినందించినా తక్కువే!
బాగుంది కదా! తిట్టాలనుకుంటే ఎలా అన్నా తిట్టచు, తల్చుకోవాలనుకుంటే ఎలా అన్నా తల్చుకోవచ్చు! [:D]
ఎందుకో ఈ పాట వింటూ ఉంటే, నాకు ఈయన అడిగిన దానికి "శ్రీనాధ" కవి సార్వభౌములు వారు చెప్పిన ఈ పద్యం గుర్తుకు వచ్చింది,
" సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపమున కిద్ద రాండ్రా
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్ || "
అదేమిటయ్యా, ఆ పాట వింటూ ఉంటే ఈ పద్యం గుర్తుకు రావటం అని అనుకోవచ్చు, ఆ సంబంధం ఏమిటీ అంటే,
ఒకటి, సిరివెన్నెల వారు శివుణ్ణి ఏమి కోరేది ఏమి అడిగేది అని, పరమేశ్వరుడు ప్రపంచం లో చేసిన అన్యాయాలను (ఇంకా మంచి పదం దొరకటం లేదు, అందుకని ఇప్పటికి ఇదే!) ప్రశ్నిస్తూ ఉంటే, అక్కడ శ్రీనాథుల వారు ఒక భిక్ష గానికి ఇద్దరు పత్నులు దేనికి అని చమత్కరించారు.
రెండోది, 'ఏమి కోరేది ఏమి అడిగేది' అని ఒకరు బాధపడుతుంటే, 'పార్వతి చాలు గంగను విడు' అని సమాధానం ఇచ్చినట్టు లేదు!
సాహిత్య సాగరానికి, మనిషి ఆలోచనకి అంతం ఎక్కడ?
సెలవు!
Subscribe to:
Posts (Atom)