Wednesday, June 3, 2009

మలి జీవితం లోకి నా తొలి అడుగు

అలో,

మహా తత్తరు పడుతూ, ఎలా ఉంటుందో అని తెగ తెగ ఆలొచిస్తూ, ఎదురు చూసిన కాలం వచ్చి వెళ్ళింది.. phew! the sigh of relief.. సాక్షిగా. ఊహించినంత ఉర్రూతలూగించక పోయినా, "ఉంది లే మంచి కాలం ముందు ముందు నా" అన్న ధైర్యనన్నా కలిగించి నందుకు మనసు కాస్త ఊరట చెందింది. ఎమోచ్చిందా ఇంత ఆవేశపడుతుంది ఈ వెర్రి హృదయం అని అడగాలను కుంటున్నారా.. అబ్బే మీకా శ్రమ ఇవ్వనుకదా!!

"ఎన్నాళ్ళో వేచిన ఉదయం, నాడే ఉదయించింది" అని అనే అంత సమయం సందర్భం కాకపోయినా, 'నేను' అనే ఒక మనిషి, 'ఉద్యోగం' అనే ఒక దానిని చేస్తా అని ఎప్పుడూ అనుకోలేదు, అలాంటిది విజయవంతంగా నా ఉద్యోగం లో మొదటి రోజు ముగించేసా అంటే ఈ మాత్రం ఆవేశపడకుండా నా పిచ్చి గుండె ఉండలేకపోతుంది.. అందుకే ఒక టపా రాసేద్దాం అని రాసేస్తున్నా.

ఇహ రోజు ఎలా గడిపావు అని అంటే, పెద్దగా చేసింది ఎమీ లేదు. అలా అని ఎమీ చెయ్యలేదనుకోవటానికి లేదు. వాతావరణాన్ని అంచనా వేసా, ఆ ఇన్స్టిట్యూట్ కి రాబోతున్న పెద్దల్ని గురించి విన్నా( ఈ విషయమే నాకు రానున్న మంచి కాలానికి సంకేతాన్ని చూపించింది), ఇలా ఏదో అలా అలా అతికీ అతకనట్టు రోజుని గడిపేసా.

ఇవన్నిటికన్నా గుర్తుండిపోయే విష్యం ఇంకొకటి, అక్కడ దేవదాసు మాస్టారి నిజ స్వరూపాన్ని చూడటం. ఆయన పేరు దేవదాసు కాదు లెండి, పేరు వాడకూడదు అయినా పేరు వాడాలి గనుక, ఈ పాట్లు. మాతో అతి సౌమ్యంగా మాట్లాడే ఆయన ఈ రోజు గర్జించటం చూసాక అర్ధం అయ్యింది ఆయన అంత ఉన్నత స్థాయిలోకి ఎలా వెళ్ళారో అన్న విష్యం, ఏమిటా అంటే, "పని లో ఉన్నప్పుడు ఆయన ఇంకా దేనిని పట్టించుకోరు" (ఇక్కడ దేనిని అంటే.. మనుషులనే :P).

అద్భుతాలు, అమోఘాలు కాక పోయినా, ఇవే నాటి నా అనుభవాలు. కొన్ని మధుర జ్ఞాపకాలు.

సెలవు.

2 comments: