యాస్ యుషువల్,
అలో,
well.. సినిమాల అతి ఇన్ఫ్లుయెన్స్ ఏ కావట్చు.. లేదా జరిగింది ఆ సినిమాలో లానే ఒక విషయం కావచ్చు.. అందుకే ఇలా పేరు పెట్టా నా టపాకు.
ఏంటి ఇది. నిన్న ఎవరో నా టపా లు చదువుతూ.. ఏవో కామెంటులు విసురుతూ ఉంటే.. ఓహో నేను రాసేదానిని కదా అని గుర్తొచ్చింది.. ఈ రోజేమో ఆ కామెంటులని మోడరేట్ చెయ్యమని మెయలు వస్తే సరే కదా అని నా బ్లాగుని నేనే ఓపెన్ చేశా.. చివరి టపా ఈస్ యిన్ ౨౦౦౯ . కెవ్! ౨౦౧౦ ఎక్కడ? ఎంగ్యే? వేర్? కహ? ఏమయిపోయా గడిచిన ఆ సంవత్సరం లో ? ఒక్క సారి కూడా ఏమి రాయాలనిపించలేదా? అసలు ఏమి జరిగింది? (చూసారా.. ఆ సినిమాలో మన చార్మి మబ్బు కాబట్టి ఇలాంటి డౌట్ మన smart జగ్గు కి వచ్చింది.. కాని ఇక్కడ నేను పరమ షార్పు కదా.. అందుకే నాకే అర్ధం అయిపోయింది.. ఒక ఇయర్ మిస్సింగ్ అని! )
ఎందుకు ఇప్పుడు ఈ గోలంత... మళ్ళి ఎంచక్కా మొదలు పెడదాం అన్న సదుదేస్యం కలుగుతోంది.. కాని.. దేని గురించి రాయాలి? కరెంటు ఎఫైర్స్ ఆ అంటే.. నాకు తెలిసింది.. జై తెలంగాణా, అయ్యో సూరి, హరే రామ వేర్ ఆర్ యు "శ్రీ కృష్ణ", కూర వండుకోవాలంటే నా జీతం సరిపోతుందా అన్నట్లు ఉన్న నిత్యావసర సరుకుల "అనిత్య"పు రేట్లు, ఇలాంటి నాట్ సో ఇంటరెస్టింగ్ బట్ స్టిల్ వెరీ రిలవెంట్ ఇష్యూస్.
పోనీ సినిమాల అంటే... వంసపారంపర్యంగా రావల్సినంత అందచందాలు లేకపోయినా.. అదే ఫ్యాక్టర్ ని బేస్ చేసుకుని మురిసి పోయే హీరోల మోర్-ఆర్-లెస్స్ బ్రయన్లెస్స్ మూవీస్ తప్ప తెలుగు లో పెద్ద చెప్పుకోతగ్గ మూవీస్ ఏమి లేవు కదా. వెల్.. నాకు బొత్తిగా కళాహృదయం లేదు.
ఏది ఏమైనా.. తనకేమి పట్టదు..పురోగతి ఆగదు.. అన్నట్టు సాగిపోయే పరిశోధనలను చూస్తే మాత్రం.. మానవ జీవన మనుగడకు సరైన పరమార్ధం ఎక్కడో ఉన్నది అన్న స్మాల్ హింట్ తగులుతోంది..
అయాం టాకింగ్ అఫ్ థిస్..
http://www.thehindu.com/sci-tech/science/article1016247.ece
సో, Many Promises to keep & Miles to go before I sleep.. అన్నట్టు సాగే ఎన్నో విశేషాలు చర్చించుకోవచ్చు.. లేదా నాకు తెలిస్తే నేను ఇక్కడ రాయచ్చు.. అన్న.. ఒక చిరు ఆశ తో..
..
Wednesday, January 5, 2011
Subscribe to:
Posts (Atom)