Saturday, October 3, 2009

*** తో తడిచిన నా చేతులు

అలో,
ఏటి చెప్పాను నానేటి చెప్పాను.. అని నేను అంటే.. చెప్పానే చెప్పొద్దూ అని అనటానికి నా బ్లాగుకి ఆస్కారం లేదు :P అందుకే రాస్తున్న నా మలి టపా.

ఆకాశం మేఘావృతమై ఉంది. పడుతున్న వానలకు ఒక కర్నూలు మునిగి పోయిందని విన్నా, కృష్ణలో కూడా నీటి మట్టం ఎక్కువై కొన్ని ఊరులు మునిగి పోతాయేమో, అందులో మా ఊరు కూడా ఉంటుందేమో అని ఆవేదన చెందుతున్న ఒక స్నేహితుని చూసా, ఏది ఏమైనా ఇవన్ని నన్ను చెలింప చెయ్యటం లేదు. ఉన్నది ఒకటే ఆలోచన. ఎం చెయ్యాలి ఈ రోజు. అసలేదన్న చెయ్యగలనా? అనుకున్నదానిలో ఒక్క శాతం అన్నా చెయ్యగలనా అని ఒకటే ఆరాటం. ఏటి యా, అంతగా ఆలోసింసేది? వాట్ ఈజ్ ఇట్టు? ఈ రోజు మళ్లీ (గళ్ళు మంది గ్లాసు) కల్లాసు. :P ఎవరిదీ? ఇంకయారిది? నాదే! :D

ఎంత చదివినా బావిలో నీళ్లు తోడినట్టు ఇంకా సందేహాలు పుట్టుకొస్తూ నే ఉన్నాయ్. ఇంత అయోమయ గందర గోల పరిస్థితి లో ఏమి చెప్తానో, ఎలా చెప్తానో అని గుండెల్లో "గుబ గుబ". అయినా "సాహసం నా పాదం" అనుకుంటూ సమర రంగం లో కి దూకా(కల్లాసు మొదలు పెట్టా)! అస్త్రాన్ని చేపట్టా( చాకు పీసు ముక్క!) . అనుకున్న వ్యవధిలో తడపడుతూ అయినా తమాయించుకుంటు, నాకు తెలిసినంతలో వారికి(తెలిసి తెలిసి నా కల్లాసులో బలి అవ్వటానికి వచ్చిన వారికి) అర్ధం అయ్యే లా చెబుతూ. బీచ్ బీచ్ మే లెగ్ పుల్లింగ్ చేస్తున్న వారికి దొరకకుండా జంపులు చేస్తు, అయ్యిందనిపించేసా.

నేర్చుకోవటం కష్టం ఐతే నేర్పించటం ఇంకా కష్టం. వాళ్ళకేం వచ్చో, ఎలా చెబితే అర్ధం అవుతుందో, ఏ విషయాన్నీ ఎన్ని రకాలు గ ఆలోచించి ఎటు నించి ప్రశ్నల వర్షం కురిపిస్తారో. అయిబాబోయి! ఇలాంటి ఒక పని చెయ్యాలి అంటే, చాలా నేర్పు ఓర్పు కావాలి. అలాంటిది కొంతమంది 'మాస్టారు'లు మాత్రం ఎలాంటి విషయాన్నీ అన్నా ఎంత చక్కగా అర్ధం అయ్యే లాగా చెబుతారో! వారి సహనానికి, నేర్పుకు, ఓర్పుకు జోహార్!

"దేవుడా, ఓ మంచి దేవుడా" నేనేం అడగాలనుకుంతున్నానో నీకు తెలుసు.. ఎందుకంటే బెసికాల్లీ యు ఆర్ గాడ్, వెరీ గుడ్ గాడ్. అదన్నమాట!

కల్లాసు అయ్యి, కుర్చీ లో కూర్చున్న నేను నా చేతులకేసి చూసుకున్న, అవి పూర్తిగా తడిచి ఉన్నాయి, హ హ, చాకు పీసు పౌడరి తో. :D :D :D

well all is fine, that ends fine, hope my students are also fine! ;) మే గాడ్ బ్లెస్ థెం!

సెలవు.