Monday, July 13, 2009

నాకు నచ్చిన Shamili

అలో,
"Oy" పాటలు బాగున్నాయి అని నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఆఫ్లయిను పెట్టిన గుర్తు. అలా వినటం మొదలు పెట్టాను ఆ సినిమాలో పాటలు. పాటలు బాగున్నాయి. "అంజలి అంజలి అంజలి, మెరిసే నవ్వుల పువ్వుల జాబిలి" ఆ సినిమాలో హీరోయిన్ అని తెలిసి సినిమా చూసేద్దాం అని కూడా చాలా ఉత్సాహపడ్డాను. ఆమె మొహం చూడటానికి google images ని తెగ వేదికేసిన గుర్తు కూడా! అక్కడక్కడ ఏవో కొన్ని ఫోటోలు కనిపించాయి. అమ్మాయి షుమారుగా ఉందనీ, హీరోయిన్ అయ్యే పోలికలు ఎక్కడా లెవ్వని కూడా కొంచెం సందేహం కలిగింది. కాని మన దర్శక నిర్మాతల మీద ఉన్న గట్టి నమ్మకం[:P]. ఏమిటా నమ్మకం అంటే, మీరే ఆలోచించుకోవచ్చు[:D]. చిన్నప్పుడు అంత ముద్దుగా ఉండే షామిలి ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా యాక్ట్ చేస్తుంది హీరోయిన్ గా, ఎలా డాన్స్ చేస్తుంది, ఇలా ఏవేవో అనుమానాలు వచ్చి ఉండవచ్చు, కాని నాకిన్ని అనుమానాలు రాలేదు సుమీ! ఏదో మళ్లీ ఇంత కాలానికి ఆమెని చూడబోతున్నాం కదా వెండి తెర మీదా అని కాస్త ఆత్రత అంతే. హమయ్య! ఉపోత్గాతం అయ్యింది.
రిలీజ్ అయిన ఇన్నాళ్ళకి చూసే తీరిక అవకాశం దొరికేసింది, సినిమా చూసేసా. చూస్తున్నంత సేపు ఒకటే ఆలోచన, "షామిలి" భలే ఉంది కదా అని. నాకెందుకో తను చాలా సహజం గా అనిపించేసింది. ఎక్కడా కాస్త కూడా అసభ్యతకు తావు లేదు. ఆమె అలంకరణలో కాని, ఆమె నటన లో కానీ, ఆమె హావభావాలలో కానీ, ఎక్కడా హీరోయిన్ ఆ ఈమె ఆన్న భావనే రాలేదు. ఇదేదో నేను అడ్డదిడ్దంగా మాట్లాడుతున్న అనుకోకండి, నాకీమె చాలా చాలా నచ్చేసింది..హీరోయిన్ అంటే ఇలానే ఉండాలేమో అన్నంతగా. ఈ కాలంలో హీరోయిన్ లు మొడెర్నిటికీ మరీ ప్రాధాన్యత ఇచ్చేసి, వస్త్రధారణలో హావభావాలలో వారు చూపిస్తున్నదానికి, సగటు మనిషి నిజజీవితానికి అస్సలు పోలికలే కనిపించటం మానేశాయి. హీరోయిన్ అంటే, ఏదో వేరే గ్రహం నించి వచ్చిన ఒక వింతజీవిలా చూస్తాను నేనైతే. ఏమిటో నిజజీవితంలో నాకలాంటి అమ్మాయిలు కనిపించటం చాలా అరుదు అని ఏమో,లేదా వారి అలంకరణకు మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దగా పోలికలు అనిపించక పోవటం వల్లనో తెలీదు కానీ, నాకు ఇప్పుడు ఉన్న మన హీరోయిన్లు గ్రహాన్తరవాసుల్లానే కనిపిస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా బట్టలు వేసుకుని, ఒక సగటు అమ్మాయిలా "షామిలి" కనిపిస్తే నచ్చక ఏమవుతుంది! ఆమె నటనపరంగా మరి కాస్త ఎదగాలేమో అనిపించిన మాట వాస్తవమే కాని, girl-next-door రోల్ కి తను సింప్లీ ఆప్ట్!

అదే విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉండబట్టలేక అంటున్న-- ఏమిటండి ఈ కాలం లో హీరోయిన్ల వేషధారణ, ఒకళ్ళకి తెలుగు మాట్లాడటం రాదు, పోనిలే డబ్బింగ్ ఆర్టిస్ట్లకు జీవనోపాది కల్పిస్తున్నారులే, ఎలాగూ అది వెనక జరిగే కార్యక్రమమే కదా అని సర్దుకుందాం అనుకుంటే, మరి వారి నటనని ఏమనాలి? కొంతమంది అయితే నవ్వుతున్నారో ఏడుస్తున్నారో కూడా అర్ధం కాదు, జరిగే సందర్భానికి వారి నడతకు ఏమిటో బొత్తిగా పోలికలే కనిపించవు, అది దర్శకుల ప్రతిభో లేదా హీరోయిన్ల ప్రతిభో మరి నా చిన్న బుర్రకి తట్టటం లేదు మరి! ఏదో కొంత మంది పుణ్యమా అంటు, హీరోయిన్ అవసరం ఇంకా సినిమాకి ఉంది అని కాలం గడుస్తుంది. ఒకప్పట్లో ఒక సావిత్రి, ఒక కృష్ణకుమారి, ఒక కాంచన, ఇలాంటి వారు నటిస్తుంటే ఎంత సహజంగా ఉండేదండి. ఎంత చక్కగా అలకరించుకునే వారో, పదహారణాల అచ్చ తెలుగు హీరోయిన్లు అంటే వీరే. ఆ తారువాతి వారిలో సౌందర్య కాస్త అలా ఉండటానికి ప్రయత్నించింది, కాని కాలక్రమేపి ఆమె కూడా కంపెటేషన్ వలయం లోపడి కాస్త వస్త్రధారణ విషయంలో కొంచెం మారింది కాని, తెలుగు సినిమాల్లో తెలుగుతనాన్ని ఉంచటానికి చాలానే ప్రయత్నించింది..
ఇక ఆతర్వాత వచ్చిన వాళ్ళల్లో అసలేవరన్న తెలుగు వారు ఉన్నారో లేదో నే అనుమానం, ఇహ పాపం వాళ్ళకి తెలుగు తనం గురించి తెలుసుకుని దానిని పాటిద్దాం అనే అంత కాల వ్యవధి కూడా ఉన్నటు లేదు, అంటే నాలుగైదు సినిమాల్లో కనిపించంగానే మాయమైపోతారు, ఏది ఎలా ఉన్న తెలుగు లో సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి ప్రజలు చూస్తూనే ఉన్నారు. అంటే కాలం తో పరుగు పెట్టటం మనిషికి ఉన్న మంచి అలవాటు కదా! తక్కిన విషయాలు ఆట్టే పట్టించుకోరు.

ఏముందండి, మారే కాలం తో మేము మారుతున్నాం అంటారు.. అంతకు ముందు ఎలా ఉన్నామో ఏమి చేసేవాల్లమో అన్నా తెలుసో లేదో వీళ్ళకి!

ఏది ఎలా ఉన్న, షామిలి బాగుంది. ఆమె కూడా కాలంతో మరీ ఎక్కువ మారకుండా ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటే ఇంకా బాగుంటుంది.

చలో, సెలవు మరి.

ps: నేను మాట్లాడుతుంది తెలుగు సినిమాల గురించి నాకు అనిపించింది మాత్రమే. దీనిని ఎవరూ అన్యధా అర్ధం చేసుకోకూడదని మనవి!