అలో,
కాలం చాల వేగవంతంగా కదులుతోంది, అది నాకు మాత్రమే అనిపించటం లేదు, ఎవరిని అడిగినా ఇదే మాట అంటున్నారు. కాలం తో నేను, నాతో కాలం అలా అలా, అంటే అల లా కాదు లెండి.. ఏదో అలా అలా.. అంటే అదేమో మరి
వేగం వేగం నేనేమో మరి
నిదానం, నేను చుస్తూ చుస్తూ అది వెళ్తూ వెళ్తూ. ఏమిటా ప్రతీదీ రెండు సార్లు అంటే, నా స్నేహితురాలు ఒకమ్మాయి కి ఈ అలవాటు ఉంది అండ్ నాకు కూడా అది గుర్తుకు వచ్చేసింది ఇది రాసేటప్పుడు, అందుకని వాడేసా.
హా.. ఎటో వెళ్ళిపోతుంది మనసు ఎటేల్లిందో అది నాకేం తెలుసు (గుర్తుకొచ్చిందా? వస్తే గుడ్డు గుడ్డు, రాక పొతే గుర్తు చేసినా దండగే :P) అక్కడ హీరో కి తెలుసో లేదో నాకు గుర్తు రావటం లేదు కాని, నాకు మాత్రం నా ఆలోచనలు ఎటువేల్లాయో తెలుస్తుంది. అదే అదే అదే, చిన్నప్పుడు నేను చూసిన తెలుగు సినిమాల మీదకు వెళ్ళింది. హిహి. నేను నా సినిమాల గోల! :D ఇంతకూ ఇక్కడ మా ఆఫీసు భవంతి లో ఏది పట్టుకుంటే ఎప్పుడు పడిపోతుందా అన్నట్టు అనిపిస్తుంటే.. భవంతి కొత్తదే లెండి.. కాని కాంట్రాక్టర్ కాస్త కక్కుర్తి పడట్టు ఉన్నాడు... లేదా అతి సుకుమారుడన్నా అయి ఉండచ్చు.. నట్లు అన్ని అలా అలా తిప్పాడు పాపం మాదేమో రాక్షస మూక, ఇదంతా ఇలా ఉంటే తలుపు వేద్దాం అని చూస్తే అదేమో పడటం లేదు. ఏంటబ్బా ఇది అని చూస్తే.. క్రింద నట్టు లూసు అయ్యింది.. ఆ చిరాకు లో "అబ్బా! ఏమిటి దేవుడా ఇది విఠలాచార్య డైరెక్షన్ లా" అని అనుకున్నా, వెంటనే గుర్తుకొచ్చాయి..
చిన్నప్పుడు సినిమాలు తెగ చూసే దానిని. చూసిందే మళ్లి మళ్లి చూసే దానిని. గుండమ్మ కధ, శాంతి నివాసం ఐతే ఎన్ని సార్లు చూసానో కూడా లెక్కలేదు. అవన్నీ ఒక రకం ఐతే, కొన్ని సినిమాలు చూస్తుంటే తెగ నవ్వొచ్చేది. ఒక పక్కన ఒక రాజు ఉంటాడు ఒక పక్క ఒక రాక్షసుడు, రాజు ఒక బాణం వేస్తాడు రాక్షసుడు ఒకటి. ఇంత వరకు బానే ఉంది. మరి బాణాలు ఏవయ్యా యంటే? గాలి లో రెండు బాణాలు చాలా స్త్రఎట్ గా, అస్సలు వంగకుండా అలా మనిషి నడిచి నట్టు వెళ్తూ ఉంటాయి.. ఎక్కడో ఒక చోట రెండు గుద్దు కుంటాయి, అండ్ కొంచెం నిప్పులు లాంటివి కింద పడతాయి. నాకు అప్పట్లో చాలా అనుమానాలు వచ్చేవి. ఏమిటబ్బా మనుషులు నడిచినట్టు బాణాలు నడుస్తున్నాయి అది కూడా గాలి లో అని. కనుక్కుంటే తెలిసింది అది విఠలాచార్య దర్శకత్వం అని. పక్కన ఉన్న పెద్ద వాళ్ళేమో అః ఓహో ఏమి దర్శకత్వం అది ఇది అని మురిసిపోతుంటే, నేను మురిసిపోయే దానిని. :D తీరా ఆలోచిస్తుంటే అది చిన్నతనమే అని ఇప్పుడు అర్ధం అవుతుంది. ఫిజిక్స్ లో చదువుకున్న "త్రాజేక్టరి" మోషన్ కి ఇది వ్యతిరేకం కదండీ.. మీరు మరీను.. :P అయినా ఆ కాలం లో మనుషులు దీనిని ఎలా ఒప్పుకున్నారో అన్న విషయం అర్ధం కాకపోయినా, నేను చూసి బానే ఆశ్చర్యం, ఆనందం అన్న అనుభుతూలను పొందాను గనుక, కాసేపు లాజిక్ పక్కన పెడతా.
ఇంతకూ గుర్తుకు వచ్చిన మహా మనీషి, "
విఠలాచార్య".
రాకుమారుడు గుహలోనికి పోవటం మాములుగా వేల్లచు కదా, ఒక పెద్ద మొహం, దానికో పెద్ద నోరు, అండ్ ఏదో ఒక మంత్రం ఇతనికి గుర్తు ఉంటేనే ఆ నోరు తెరుచుకుంటుంది. సిక్రెట్ కీ .. క్రిప్తోగ్రఫి కదా :P అందుకే ఇది నచ్చిందేమో. ఇంకా ఒక ద్వారం కాకుండా చాలా ద్వారాలు దారులు దాటుకుని రాకుమారుడు లోపలికి వెళ్ళాలి, మధ్యలో అడ్డుకుంటే రాక్షసులు, హ హ multiple layers of security :P. ఇవన్నీ చాలానే లాజికల్ గానే ఉన్నాయి కదా! అందుకే నాకు ఆ సినిమాలు నచ్చేవి ఏమో! ఆ కాలం లో తీసినా లాజికల్ గానే ఉన్నాయి కదా, మరి ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఎంటండి, హీరో కొడితే విలన్ గాలిలోకి లేస్తాడు? అది అసలు కుదుర్తుంది అంటారా? ఒక వేళ కుదరాలంటే, హీరో చాలా బలవంతుడు అవ్వాలి, విలన్ చిన్న పిల్లడు అవ్వాలి, కానీ ఈ మధ్య సినిమాల్లో ఏమో హీరోలు ఇరవై ఏళ్ళు కూడా లేని పిల్లలు విలన్ ఏమో చిన్న ఏనుగు పిల్లలా ఉంటాడు, మరి ఈ హీరో కొడితే విలన్ ఎలా ఎగురుతాడు? కమాన్! లాజిక్ ఎక్కడ??? ఇలాంటివి చూసే పిల్లలు ఎలా ఆలోచిస్తారు? పెద్ద పెద్ద గ్రఫిక్లతో విన్యాసాలు అంటే ఏదో లే అనుకోవచ్చు, గ్రాఫిక్స్ అని తెలుస్తాయి గనుక పోనిలే అనుకోవచ్చు.. మరి ఈ హీరోల వ్యవహారం ఏంటి? ఏంటో లే. నో కామెంట్స్.
ఈయన సినిమాల్లో నేనేమి చూసానా అని వికీ లో వెదుక్కుంటే
"ఆలీబాబా నలబై దొంగలు", "చిక్కడు దొరకదు" ఇవే గుర్తుకొస్తున్నాయి :(. సినిమాల పేర్లు నాకు గుర్తులేవేమ్మో అని నా గట్టి నమ్మకం. పెద్దగ సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు, ఉన్న అతి తక్కువ పరిజ్ఞానం లో వచ్చే ప్రేక్షకులకు నేత్రానందం కలిగించే లా సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు ఎంత మందికి గుర్తున్నారో తెలీదు. గుర్తుంచుకోదగ్గ దర్శకులని మాత్రం గట్టిగ నమ్ముతాను. అందుకే నా ఈ టపా ఆయనకు అంకితం.
"జాన పద బ్రహ్మ" -- శ్రీ విఠలాచార్య కు నా ఈ టపా అంకితం. సెలవు.